Thursday, May 2, 2024

రామ్ లింగుస్వామి సినిమాకు కొత్త చిక్కు !! సినిమా ఆపేస్తార ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. అదే జోష్ తో ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా రామ్ పోతినేని తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ఓ కొత్త చిక్కు వచ్చి పడింది.

ఈ సినిమాను ఆపాలని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా కోరుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. దర్శకుడు లింగుస్వామి తో జ్ఞానవేల్ రాజా కు సినిమాల పరంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉన్నాయట. ఆ లెక్కలు తేలేవరకు లింగస్వామి మరో సినిమా చేయకుండా చూడాలని తెలుగు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

అయితే దీని పై జ్ఞానవేల్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో లింగస్వామి ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాని పక్కన పెట్టేసి రామ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇది కరెక్ట్ కాదు. ముందు అనుకొన్న ప్రకారం మా బ్యానర్ లో సినిమా చేయాలి అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement