Sunday, May 5, 2024

ఫ్లాష్ న్యూస్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్?

హుజురాబాద్ ఉపఎన్నిక కోసం అన్ని పార్టీ తమ అస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీ అభ్యర్థి ఈటెలకు చెక్ పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా హుజురాబాద్ ఉపఎన్నికపై దృష్టి పెట్టింది. తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పాత చీఫ్ ఉత్తమ్‌కు రేవంత్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఉత్తమ్ తమ బంధువులకు హుజురాబాద్ టిక్కెట్ ఇచ్చేందుకు గతంలో ప్రయత్నాలు చేశారు. కానీ కొత్త పీసీసీ చీఫ్‌గా రేవంత్ రావడంతో ఆయన పొన్నం ప్రభాకర్ పేరును అధిష్టానానికి సిఫారసు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రేపో, మాపో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement