Friday, May 3, 2024

కోమలి కొంపముంచిన నెటిజన్స్… మరోసారి సారంగదరియా వివాదం

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అందులో సారంగదరియా సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అయితే సారంగదరియా పాట తనదంటూ జానపద గాయని కోమలి గతంలో మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల కూడా స్పందించి వివాదాన్ని సద్దుమణిగించారు. కాగా ఓ బుల్లితెర నిర్వహించిన షో లో కోమలి సారంగదరియా పాటను పాడారు. లవ్ స్టోరీ సినిమాలో తన పాట పెట్టుకున్నందుకే హిట్ అయిందని ఆమె తెలిపారు. అందుకు సంబంధించిన ప్రోమోను షో నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఇక ఆ ప్రోమో చూసిన నెటిజన్లు కోమలి పై మండి పడుతున్నారు. పాట మంగ్లీ పాడింది కాబట్టి హిట్ అయిందని… నువ్వు పాడి ఉంటే కనీసం ఎవరు చూసే వారు కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement