Tuesday, April 30, 2024

నేను స్టూడెంట్ స‌ర్.. రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

హీరో బెల్లంకొండ గ‌ణేశ్ న‌టిస్తున్న తాజా చిత్రం నేను స్టూడెంట్‌ సర్. అవంతిక దస్సానీ ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు . యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ సముద్రఖని పోలీసాఫీసర్‌ అర్జున్‌ వాసుదేవన్‌ పాత్రలో నటిస్తున్నారు. సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నాంది ఫేం సతీశ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్‌-అనిత్‌ మదాడి సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్‌, చరణ్‌ దీప్‌, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. జూన్‌ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్‌ ఒకటి విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement