Friday, April 19, 2024

బైక్ కొనిస్తేనే తాళి క‌డ‌తా.. అలిగిన పెళ్లి కొడుకు..!

ప్ర‌తీ సినిమాలో ఒక హీరో ఉంటాడు.. అలాగే రియ‌ల్ లైఫ్ లో కూడా హీరో అయ్యాడు ఓ ఎమ్మెల్యే.. పాత సినిమాల‌ను మ‌నం చూస్తే పెళ్లి కొడుకు తాళి క‌ట్టే స‌మ‌యానికి ఆపండ్రా… అనే డైలాగ్స్ మ‌నం విన్నాం.. అది విల‌న్స్ చెప్పే మాట‌.. ఇక్క‌డ విల‌న్ ఎవ‌ర‌య్యా అంటే.. పెళ్లికొడుకు కావ‌డం విశేషం.. అదేంది అనుకుంటున్నారా.. మీరు ఓ లుక్కేయండి..

క‌రీంన‌గ‌ర్ లోని ఓ వ‌ధువు పెళ్లికి అతిథులంతా విచ్చేశారు. పూజారి పెళ్లి క్ర‌తువు ప్రారంభించాడు.. ఇక వ‌రుడికి వ‌ధువు మెడ‌లో తాళి క‌ట్టాలి అని పూజారీ సూచించాడు. తాళి క‌ట్టే స‌మ‌యంలో వ‌రుడు నాకు బైక్ కొనిపెడితేనే తాళి క‌డ‌తా అని భీష్మించుక్కూర్చున్నాడు. దీంతో వ‌ధువు త‌ల్లిదండ్రులు, బంధువులు ఏం చేయాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డ్డారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఆ వ‌రుడికి రూ.50 వేల న‌గ‌దును అందించాడు. మిగ‌తా న‌గ‌దు కూడా ఇచ్చి బైక్ కొనిస్తాన‌ని వ‌రుడికి హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే ర‌స‌మ‌యి జోక్యంతో వివాహం స‌క్ర‌మంగా జ‌రిగింది. దీంతో వ‌ధువు త‌ల్లిదండ్రులు, బంధువులు ఎమ్మెల్యేకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మొత్తం మీద ఈ పెళ్లిలో హీరో మ‌న ఎమ్మెల్యే ర‌స‌మ‌యి అంటూ ప‌లువురు అభిమానులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement