Saturday, September 30, 2023

ఇమ్రాన్ ఖాన్ కు ఊర‌ట – బెయిల్ మంజూరు

ఇస్లామాబాద్‌: అల్ ఖాదిర్ ట్ర‌స్టు కేసులో అరెస్టు అయిన ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ హైకోర్టు లో ఊర‌ట ద‌క్కింది.ఈ కేసులో ఆయ‌న‌కు రెండు వారాల పాటు తాత్కాలిక‌ బెయిల్ మంజూరీ చేసింది. జ‌స్టిస్ మియాంగుల్ హ‌స‌న్ ఔరంగ‌జేబ్‌, జ‌స్టిస్ సమాన్ రాఫ‌త్ ఇంతియాజ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇమ్రాన్‌కు బెయిల్ ఇచ్చింది. ఇదే సంద‌ర్బంగా ఇమ్రాన్‌పై ఉన్న అన్ని కేసుల్ని ఒకేద‌గ్గ‌రికి మార్చాల‌ని కోరుతూ ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టును కోరారు. కోర్టురూమ్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు నేప‌థ్యంలో విచార‌ణ రెండు గంట‌లు ఆల‌స్యంగా సాగింది. కాగా, కోర్టు విచార‌ణ స‌మ‌యంలో ఇమ్రాన్ వార్నింగ్ ఇచ్చారు. ఒక‌వేళ త‌న అరెస్టు కొన‌సాగితే అప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు ఉదృతం అవుతాయ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement