Monday, May 20, 2024

కావాల‌నే ‘ఫ్యామిలీ స్టార్‌’పై నెగిటివ్ రివ్యూలు.. పోలీసులకు ఫిర్యాదు

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ కి ముందే కొన్ని యూట్యూబ్ చానెళ్లు సినిమాపై నెగెటివ్ ప్రచారం చేశాయి. అయితే ఇలా నెగెటివ్ ప్రచారం చేసే వారి పని పట్టేందుకు విజయ్ టీం ముందుకు కదిలింది. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కావాలనే కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement