Friday, May 3, 2024

తమ కవల పిల్ల‌ల‌ పూర్తి పేర్లు ఇవే.. వెల్లడించిన నయనతార, విఘ్నేష్ శివన్

నయనతార, విఘ్నేష్ శివన్ జూన్ 2022లో వివాహం చేసుకున్నారు. వీరి పెండ్లి వేడుక‌కు రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సూర్య, అట్లీ, ఇతర ప్ర‌ముఖ‌ తారలు హాజరయ్యారు. అయితే, దర్శకుడు విఘ్నేష్ శివన్, నటి నయనతార గత సంవత్సరం క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి తల్లిదండ్రులుగా మారారు. సరోగసీ ద్వారా తమ కుమారులను స్వాగతించిన ఈ జంట, తరచుగా విఘ్నేష్ సోష‌ల్ మీడియా ఎకౌంట్ పోస్ట్‌లో వారు సంతోషంగా గ‌డుపుతున్న సమ‌యాన్ని వీడియోలు, ఫోటోల ద్వారా పంచుకుంటూ ఉంటారు.

అయితే.. ఇప్పుడు ఈ జంట సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తమ కవల పిల్ల‌ల పూర్తి పేర్లను వెల్లడించింది. నయనతారతో ముద్దుగా ఉన్న అబ్బాయిల ఫొటోల‌ను షేర్​ చేస్తూ.. విఘ్నేష్ శివన్ వారి పిల్లలు “ఉయిర్, ఉలాగ్” పూర్తి పేర్లను ప్రకటించాడు. “ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్”, “ఉలగ్ దైవిక్ ఎన్ శివన్”, మొదట ప్రపంచానికి ఉయిర్, ఉలాగ్‌గా పరిచయం అయ్యారు. సోషల్ మీడియా పోస్ట్ కాప్ష‌న్ లో, “N అంటే ప్రపంచంలోనే ది బెస్ట్ మ‌ద‌ర్ #నయనతార. మా శిశువుల పేర్లను పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం” అంటూ విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement