Monday, April 29, 2024

టెన్త్ పేప‌ర్ లీక్ – ఎస్ ఎస్ సి బోర్డు కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త‌..

హైద‌రాబాద్ – తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ఘటనకు బాద్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాల‌ని కోరుతూ ఎస్ ఎస్ సి కార్యాయం వ‌ద్ద ఎన్ఎస్ యూఐ ఆందోళనకు దిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ సంద‌ర్భ‌గా ఆందోళన కారులు SSC బోర్డు , గేటును ధ్వంసం చేశారు. కార్యాలయంపైకి కోడి గుడ్లు విసిరారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఎన్ఎస్ యూఐ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బల్మూరి వెంకట్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, 10వ తరగతి ప్రశ్న ప త్రాల లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.

రేప‌టి ప‌రీక్ష య‌థాత‌థం..
ఇది ఇలా ఉంటే తాండూరు పేప‌ర్ లీకేజ్ ఘ‌ట‌న‌లో న‌లుగురిని సస్పెండ్ చేశారు. పేప‌ర్ లీకేజ్ కు కార‌కుడైన స్కూల్ అసిస్టెంట్ బంద‌ప్ప‌తో పాటు వ‌న్ స్కూల్ సూప‌రింటెండెంట్, ఇన్విజిలేట‌ర్,డిపార్ట్మెంట్ అధికారి స‌స్పెండైన వారిలో ఉన్నారు.. దీనిపై తాండూరు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.. ఇక లీకైన ప్ర‌శ్నాప‌త్రం ఇత‌రుల చేతికి వెళ్ల‌లేద‌ని విద్యా శాఖ డైరెక్ట‌ర్ దేవ‌సేన ప్ర‌క‌టించారు..పేప‌ర్ లీకేజ్ స‌మ‌యానికే విద్యార్ధులంద‌రూ పరీక్ష హాలులో ఉన్నార‌ని తెలిపారు.. ఇక రేప‌టి ప‌రీక్ష య‌థాత‌థంగా ఉంటుంద‌ని తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement