Monday, May 6, 2024

న‌య‌న‌తార సినిమా డైరెక్ట్ ఓటీటీలో.. ఎప్పుడంటే..!

న‌య‌న‌తార హీరోయిన్ గా జీఎస్.విగ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో థ్రిల్ల‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన మూవీ ‘O2’. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఎస్ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్ఆర్ ప్ర‌భు ఈ మూవీని నిర్మించారు. రిత్విక్‌, లీనా, మ‌నోహ‌ర్‌, అడ‌కులం మురుగ‌దాస్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించగా.. న‌య‌న‌తార ఎనిమిదేళ్ళ బాబుకు త‌ల్లిగా న‌టించింది. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే ఈ సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఇక‌, జూన్ 17న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా విడుద‌ల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement