Sunday, April 28, 2024

నారప్ప ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఇందులో వెంకీ సరసన సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ పై సరైన క్లారిటీ రాలేదు.

అయితే తాజాగా ఈ సినిమాలోని చలాకీ చిన్నమ్మి అనే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ పాట వెంకటేష్ పెద్ద కొడుకుగా నటించిన కార్తీక రత్నం పెళ్లిచూపులు సందర్భంలో వచ్చే పాటగా అర్థం అవుతుంది. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటను… ఆదిత్య అయ్యంగార్ ,నూతన మోహన్ ఆలపించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement