Thursday, May 2, 2024

Pratinidhi 2 | మళ్లీ వాయిదాపడ్డ నారా రోహిత్ సినిమా

టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన పొలిటికల్ సూపర్ హిట్ మూవీ “ప్రతినిధి”. ఈ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2” వస్తొంది. ఈ మూవీకి జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకి ఈ ఏప్రిల్ 25న రిలీజ్ రావాల్సి ఉంది.

అయితే, లేటెస్ట్ గా డేట్‌ని కూడా వాయిదా వేసినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసారు. మరి ఈ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండ‌గా.. వానర ఎంటర్టైన్మెంట్స్ అలాగే రానా ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement