Monday, April 29, 2024

Hanuman సీక్వెల్ పోస్ట‌ర్ అధుర్స్ !

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ‘జై హనుమాన్ ని తెరకెక్కిస్తున్నారు. హనుమాన్ సృష్టించిన ప్రభంజనంతో జై హనుమాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా కూడా అద్భుతమైన పోస్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాని 3డి ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement