Saturday, April 27, 2024

యంగ్ టైగర్ కు నారా లోకేష్ ఏమని విష్ చేశారో తెలుసా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ లు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు… నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ అత్త పురంధేశ్వరి కూడా సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement