Friday, November 8, 2024

Hi nanna | హాయ్ నాన్న బుకింగ్స్ ఓపెన్..!

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన‌ ఫీల్డ్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘‘హాయ్ నాన్న’’. ఈ సినిమా ఈ వారం డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సినిమా పై మంచి హైప్ కూడా వచ్చింది. కాగా, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మేకర్స్ ఇందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. హాయ్ నాన్న మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, హేషం అబ్ధుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement