Friday, October 4, 2024

HYD: ఇంట్రా వి70 పికప్, ఇంట్రా వి20 గోల్డ్ పికప్, ఏస్ హెచ్‌టి ప్లస్ ని ఆవిష్కరించిన టాటా మోటార్స్

హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్, మొదటి, చివరి అంచె రవాణాను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా సరికొత్త ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏసీఈ హెచ్ టీ ప్లస్ లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ… వివిధ రకాల వినియోగాలకు సరైన పరిష్కారాలను అందించడంతో పాటు, తమ చిన్న వాణిజ్య వాహనాలు, పికప్‌లు తమ కస్టమర్ల జీవనోపాధిని, జీవన నాణ్యతను మెరుగు పరుస్తాయన్నారు. ఈరోజు తాము ఆవిష్కరించే వాహనాలు నిర్దిష్ట అభిప్రాయ సేకరణ, డిమాండ్‌ ఆధారంగా రూపొందించబడ్డాయన్నారు. అవి ఇంధన సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, ఎక్కువ దూరాలకు ఎక్కువ పేలోడ్‌లను తీసుకువెళ్లడానికి వీలుగా రూపొందించబడ్డాయన్నారు.

వేగవంతమైన పట్టణీకరణ, విజృంభిస్తున్న ఇ-కామర్స్, వినియోగంలో పెరుగుదల, హబ్-అండ్-స్పోక్ మోడల్ పెరుగుదల, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌లో సమర్థవంతమైన, ప్రభావవంతమైన చివరి, మొదటి అంచె రవాణా ప్రాముఖ్యత తగినంతగా నొక్కి చెప్పబడడం లేదన్నారు. అందుకే, ఇప్పుడు ఆవిష్కరించబడిన ప్రతి వాహనం కూడా హామీతో పాటు బలమైన, విశ్వసనీయమైన కార్గో రవాణా పరిష్కారాన్ని అందించడానికి వీలుగా రూపొందించబడిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement