Friday, April 26, 2024

యంగ్ హీరో తో నందినీరెడ్డి ?

ఏక్ మినీ కథ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంతోష్ శోభన్. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కరోనా కారణంగా ఓటిటి లో రిలీజ్ అయినప్పటికీ పర్లేదు అనిపించుకుంది. అయితే సంతోష్ శోభన్ తో త్వరలో నందినీరెడ్డి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా మరో రెండు మూడు రోజుల్లో రానుందట.

ఓ బేబీ సినిమా తో హిట్ కొట్టిన నందినిరెడ్డి ఆ తర్వాత తన కొత్త సినిమాకు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. నిజానికి మొదట నందినీరెడ్డి నాగచైతన్యతో ఓ సినిమా చేయాలని అనుకుంది. కానీ నాగచైతన్య ప్రస్తుతం థాంక్యు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా మరో రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. కాబట్టి ఈ గ్యాప్ లో సంతోష్ శోభన్ తో సినిమా చేయడానికి నందినిరెడ్డి రెడీ అయినట్లు తెలుస్తోంది. సంతోష్ గతంలో తను నేను, పేపర్ బాయ్ చిత్రాలు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement