Wednesday, April 24, 2024

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో రామ్ పోతినేని కనిపించబోతున్నాడట.

అయితే ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా రామ్ నటించిన లేదు. మొదటిసారి రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి రామ్ సరసన నటిస్తోంది. మరి ఈ సినిమా సినీ అభిమానులను ఎంతవరకూ అలరిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement