Saturday, May 4, 2024

నాగ శౌర్య @టాలీవుడ్ హృతిక్ రోషన్

నాగ శౌర్య గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం నాగ శౌర్య లక్ష్య, వరుడు కావలెను, ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి చిత్రాలలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో ఈ హీరో 5వ ప్లేస్ ను దర్శించుకున్నాడు. అయితే తాజాగా నాగ శౌర్య కు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జిమ్ వర్క్ ఔట్ సెషన్ కు సంబంధించిన ఫోటో అది. తన వ్యక్తిగత శిక్షకుడు సమక్షంలో కరోనా సమయంలో కూడా కష్టపడుతున్నాడు నాగ శౌర్య. కరోనా ఫస్ట్ వేవ్ లో సిక్స్ ప్యాక్ తో కనిపించిగా ఇప్పుడు మరింత దృఢంగా తయారయ్యడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement