Saturday, May 4, 2024

ఏపీలోని వైద్య కళాశాలల్లో సీట్లు పెంపు

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 145 పీజీ సీట్లు పెరగనున్నాయి. కర్నూలు, అనంతపురం, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కడపలోని వైద్య కళాశాలల్లో సీట్లు పెరగనున్నాయి. కళాశాలల్లో మౌళిక వసతుల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కొందరికి ప్రొఫెసర్లుగా పదోన్నతి నివ్వటంతో పాటు మరికొందరిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కళాశాలల్లో పీజీ సీట్లు పెంచాలంటే దానికి తగ్గట్లు వసతులు అవసరం. పరికరాలు, సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల మేరకు సీట్లు పెంపుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సంబంధిత సీట్లకు ఎస్సెన్షియాలిటీ సర్టిఫికెట్ జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement