Friday, May 17, 2024

నాగ్ హై వోల్టాజ్ డ్రామా…లేటెస్ట్ అప్డేట్

అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరు పదుల వయసు మీద పడుతున్నా ఏ మాత్రం తగ్గని గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హై వోల్టాజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్రవీణ్ సత్తార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో నాగార్జున ఎక్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆ పాత్ర కోసం పూర్తిస్థాయిలో మేకోవర్ అయ్యాడట నాగ్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నాగార్జున చెల్లి క్యారెక్టర్ లో బాలీవుడ్ నటి గుల్ పనాంగ్ నటించనున్నట్లు సమాచారం. ఇటీవల చిత్రయూనిట్ కూడా ఆమెతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement