Tuesday, April 30, 2024

Nagarjuna: నా సామిరంగ టీజర్‌ విడుదల

నాగార్జున అక్కినేని మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నా సామి రంగ’తో 2024 సంక్రాంతి పండుగకి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్‌ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్‌, రొమాన్స్‌తోపాటు ఫ్రెండ్షిప్‌ కూడా కోర్‌ ఎలిమెంట్‌.తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.

ఇందులో సినిమాలోని అన్ని ఇతర లేయర్స్‌ని పరిచయం చేశారు. నాగార్జున గురించి ఆషికా రంగనాథ్‌, అల్లరి నరేష్‌ మధ్య జరిగిన ఆసక్తికర మైన సంభాషణతో టీజర్‌ ప్రారంభమవుతుంది. నాగార్జున మామిడి తోట ఫైట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. నాగ్‌, ఆషికా పదేళ్లుగా మాట్లాడుకోరు. కానీ కళ్లతో కమ్యునికేట్‌ చేసుకుంటారు. యంగ్‌ ఏజ్‌లో వీరిద్దరి ప్రేమ, నాగ్‌ తన స్నేహితులైన అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లతో స్నేహం టీజర్‌లో చూపించారు. నాగార్జున గోదావరి యాస చాలా బాగుంది. ఆషికతో అతని కెమిస్ట్రీ అలరించింది. నాగ్‌, నరేష్‌, రాజ్‌ తరుణ్‌ స్నేహం మరొక ప్రధాన ఆకర్షణ. శివేంద్ర దాశరధి ఫ్రేమ్‌లను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ చిత్రానికి కథ, సంభాషణలు రాశారు. ‘నా సామిరంగ’ 2024లో సంక్రాంతికి థియేట్రికల్‌ రిలీజ్‌ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement