Sunday, April 28, 2024

రాజ‌మౌళితో మూవీ అంటే స్కూల్ కి వెళ్లిన‌ట్లే..ఆలియాభ‌ట్

బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రశంసలు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై కురిపించారు. రాజమౌళితో పని చేయడం అంటే స్కూలుకు వెళ్లడంతో సమానమని అన్నారు. ఆయన ఓ మాస్టర్ స్టోరీ టెల్లర్ అన్నారు. టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రాజమౌళి, షారుక్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో ఆలియా భట్ మాట్లాడుతూ.. రాజమౌళిని మొదటి సారి బాహుబలి’ ప్రీమియర్ లో కలిశానని, సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయానని చెప్పారు. ఎలాగైనా ఆయన దర్శకత్వంలో నటించాలని అనుకున్నానని, ఆర్ఆర్ఆర్ తో అది నెరవేరిందని చెప్పారు. రాజమౌళి దగ్గర పని చేయడం అంటే స్కూలుకు వెళ్లడంతో సమానం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మరెన్నో కొత్త అంశాలు తెలుసుకోవచ్చు. ఆయన ఒక కథను అద్భుతంగా తెరకెక్కించగలరు. తన సినిమాల ద్వారా అందరినీ ఒక చోటుకు చేర్చుతారు అని వ్యాఖ్యానించారు. నటన పరంగా ఏదైనా సలహా ఇవ్వమని అడిగాను. ఏ క్యారెక్టర్ లో నటించినా.. ప్రేమతో చేయాలి’ అని రాజమౌళి చెప్పారు. సినిమా పెద్దగా ఆడకపోయినా.. మనం చేసిన పాత్ర జనాలకు గుర్తుండిపోయేలా నటించాలని సూచించారని చెప్పింది. ఆర్ ఆర్ ఆర్ లో న‌టించ‌డం త‌న అదృష్ట‌మ‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement