Sunday, April 28, 2024

డిసెంబ‌ర్ నుంచి వందే భార‌త్ మెట్రో ప‌రుగులు …

ఢిల్లీ – దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల నుంచి స‌మీపంలోని ప‌ట్ట‌ణాల‌కు వందేభార‌త్ త‌ర‌హా మెట్రో రైళ్లు న‌డ‌పాల‌నే ప్ర‌ధాన మంతి న‌రేంద్ర మోడీ ఆశ‌యం త్వ‌ర‌లో నెర‌వేర‌నుంది.. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ, ఈ ఏడాది డిసెంబరు నాటికే వందే మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
”వందే భారత్‌తో పోలిస్తే.. వందే మెట్రో విభిన్నంగా ఉంటుంది. చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో రోజుకు నాలుగు-ఐదు సర్వీసులు నడిపేలా దీన్ని రూపొందిస్తున్నాం. పెద్ద నగరాల నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలకు ఇవి రాకపోకలు సాగిస్తాయి. సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఇవి పట్టాలెక్కనున్నాయి” అని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. పెద్ద నగరాల చుట్టుపక్కల ఉన్నవారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు సత్వరం చేరుకునేలా చేయడానికి వందే మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారని రైల్వే మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ రైళ్లు ఎనిమిది బోగీల‌తో ఉంటూ గంట‌కు 110 కిలో మీట‌ర్ల వేగంతో ప‌య‌నిస్తాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement