Sunday, April 28, 2024

మాస్ట్రో ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ సాధించిన అందాధూన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నితిన్ కెరీర్ లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తోంది. అలాగే మరో కీలక పాత్రలో తమన్నా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు సినిమా పై అంచనాలు మరింత పెంచాయి.

కాగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్….ను ఈనెల 23వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా… డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement