Wednesday, May 1, 2024

పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ ?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజుగా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్నారు…అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండో పార్ట్ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నారట. అలాగే బన్నీ సినిమా దీని కోసం కాల్ షీట్ లు కేటాయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement