Thursday, April 25, 2024

Breaking: తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్

తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విదించింది. ఈరోజు సమావేశమైన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.

కోర్టు అడిగిన మేరకు జవాబు ఇచ్చేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల కొద్దిమేర కరోనా కేసులు, మరణాలు తగ్గినా… ఇతర ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని కొన్నిరోజుల పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రంజాన్ (మే 14) తర్వాత లాక్ డౌన్ ప్రకటిస్తారని మొదట వార్తలు వచ్చాయి. కానీ అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో రేపటి నుంచే లాక్ డౌన్ అమలు చేయాలని నేటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కాసేపట్లో వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement