Wednesday, May 1, 2024

ఎంత పని…!! విష్ణు వండర్ ఫుల్ యాక్టర్ అనగానే పవర్ కట్

మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా సరైన హిట్ మాత్రం కోట్టలేకపోయాడు. అయితే ప్రస్తుతం జెఫ్రెన్ చిన్ డైరెక్షన్ లో మోసగాళ్లు సినిమా చేస్తున్నాడు. అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు తో పాటు కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఆ ఐటి స్కామ్ ఏంటి.. ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఆ స్కామ్ వల్ల లాభపడింది ఎవరు.. అనేదే ఈ కథాంశం.

ఇక ఈ సినిమా మార్చి 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ జరిపింది. ఇక ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కూడా వచ్చారు. అయితే మోహన్ బాబు మాట్లాడుతున్న సమయంలో జరిగిన ఓ విషయంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ… మంచు విష్ణు వండర్ ఫుల్ యాక్టర్ అనగానే.. పవర్ కట్ అయింది. దీంతో వెంటనే మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక దీనిపై గత రాత్రి నుంచి కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అవును నిజమే కదా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement