Thursday, May 2, 2024

తమిళనాడు రాజకీయ నేతల్లో అత్యంత ధనవంతుడిగా కమల్

నటుడిగా తానేంటో నిరూపించుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయ నేతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోమవారం నాడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ నామినేషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. 176.93 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. అందులో స్థిరాస్తులు రూ. 131.84 కోట్లు, చరాస్థులు రూ. 45.09 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇక లండన్‌లో రూ. 2.50 కోట్లు విలువ చేసే ఇల్లు.. రూ. 2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు తనకు రూ. 49.5 కోట్ల అప్పు ఉన్నట్టు కమల్ పేర్కొన్నారు. దీంతో తమిళనాడులోని ముఖ్య రాజకీయ నేతల్లో అత్యంత ధనవంతుడిగా కమల్ నిలిచారు. రెండో స్థానంలో ఉదయనిధి స్టాలిన్ (డీఎంకే) ఉన్నట్లు సమాచారం. ఇక తన విద్యార్హత 8వ తరగతిగా నామినేషన్‌లో కమల్ ప్రస్తావించారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ (సౌత్) నుంచి కమల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement