Saturday, May 18, 2024

దోమతెరలు పంపిణీ

కన్నాయిగూడెం, కరోనా నివారణకు మాస్క్ లు ధరించిన విధంగా జ్వరాల నివారణకు దోమ తెరలు వాడాలని కన్నాయిగూడెం పీహెచ్ సీ డాక్టర్ అల్లి నవీన్ కోరారు . మండలంలోని ముప్పనపల్లి గ్రామంలో హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో దోమ తెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రానున్న కాలం ఒక వైపు కరోనాతో పాటు మరోవైపు అంటువ్యాధులు ప్రబలే ప్రమాధం ఉందని, దీన్ని నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా దోమ తెరలు ఎంతగానో దోహదపడుతాయన్నారు ఈ దోమతెరలను ప్రత్యేకమైన రసాయనాలతో తయారుచేశారని, దోమలు వీటిపై వాలిన వెంటనే చనిపోతాయని చెప్పారు.550 గృహాలకు దోమ తెరలను పంపిణీ చేశామని అన్నారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రెడ్డి లక్ష్మీనారాయణ,కారోవబార్ పెద్దల లక్ష్మీనారాయణ,ఏఎన్ఏం కవిత ,ఆశావర్కర్లు రాజేశ్వరి, కోమల మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement