Sunday, May 19, 2024

కాబోయే భ‌ర్త‌తో మెహ‌రీన్.. ఫోటోలు వైరల్

పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ తనకు కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా, తనకు కాబోయే భర్త భ‌వ్య‌తో క‌లిసి దిగిన కొన్ని ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది మెహ‌రీన్. ఇందులో ఇద్ద‌రు ఏకాంతంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. ఇలానే క‌ల‌కాలం ఉండాల‌ని తాను కోరుకుంటుంది. ఇటీవ‌ల హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న మెహ‌రీన్ త్వ‌ర‌లోనే అత‌నితో ఏడ‌డుగులు వేయ‌నుంది. అయితే కాబోయే శ్రీవారు పరిచయమై కేవలం పది నెలలే అయినప్పటికీ జీవితకాలం అతనితో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుందని మెహ‌రీన్ అంటోంది. గత ఏడాది లాక్‌డౌన్ లో వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా, భ‌వ్య బ‌ర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం అండమాన్‌ వెళ్లారు. స్కూబా డైవింగ్‌ చేస్తున్న సమయంలో ‘విల్‌ యూ మ్యారీ మీ’ అనే కార్డుతో భవ్య మెహ‌రీన్ ను సర్‌ప్రైజ్ చేశాడు. నేను కూడా ఓకే చెప్పాను అని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది మెహ‌రీన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement