Thursday, May 16, 2024

పల్లెటూరులో మళ్ళీ పంచె కట్టబోతున్న మెగాస్టార్ ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత లూసీఫర్ ,వేదాళం రీమేక్ లలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అలాగే వీటితో పాటు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు కోన వెంకట్ స్క్రిప్టు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం.

అంతే కాదు ఈ సినిమాలో పల్లెటూరి మొనగాడు గా మెగాస్టార్ కనిపించబోతున్నాడట. ఇక ఇటీవల కాలంలో చిరంజీవి నుంచి అలాంటి సినిమాలు వచ్చింది లేదు. గతంలో పల్లెటూరి మొనగాడు, ఆలయశిఖరం, అల్లుడా మజాకా వంటి సినిమాలలో చిరంజీవి నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత అలాంటి తరహాలో సినిమాలు చేయలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ పల్లెటూరి వాతావరణంలో మెగాస్టార్ సినిమా చేయబోతున్నాడు. మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement