Monday, April 29, 2024

16ఏళ్ల త‌ర్వాత చిరంజీవితో – త్రిష‌ !

మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న హీరోయిన్ గ‌తంలో ప‌లు చిత్రాల్లో న‌టించింది. 2006వ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన స్టాలిన్ చిత్రంలో ఆమె న‌టించింది. కాగా 16ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి చిరంజీవితో న‌టించేందుకు సిద్ధ‌మైంది త్రిష‌. చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. దీంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు తొలుత శృతిహాసన్ ను అనుకున్నప్పటికీ… తాజాగా త్రిషను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement