Thursday, March 28, 2024

ప్రతీ ఆట కూడా ఒక అభ్యాసనే : కేఎల్ రాహుల్

ప్ర‌తీ ఆట కూడా ఒక అభ్యాస‌నే అనే భార‌త జ‌ట్టు ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ అన్నారు. రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉండటంతో వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించడం తెలిసిందే. ఓ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా కేఎల్ రాహుల్ పలు అంశాలపై స్పందించాడు. కెప్టెన్సీ విషయంలో మరింత మెరుగ్గా ఉండాలన్నాడు. మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ‘‘గడిచిన రెండు మూడేళ్లుగా కెప్టెన్ గా నేను తెలుసుకున్నది.. కెప్టెన్సీ అన్నది కచ్చితంగా మెరుగుపడే స్థానం.


జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడే నేర్చుకోవచ్చు. నిజంగా ఆ అవకాశం వచ్చినప్పుడు పాత్ర వేరేలా ఉంటుంది. ప్రతీ ఆట కూడా ఒక అభ్యాసనే. నా కెరీర్ లేదా కెప్టెన్ బాధ్యతలను ముగించే వరకు ఈ అభ్యాసన ఆగిపోతుందని అనుకోవడం లేదు’’ అని రాహుల్ చెప్పాడు. ఆట అన్న తర్వాత గెలుపు, ఓటములు ఉంటాయన్నాడు రాహుల్. ఖ‌చ్చితంగా ప్రతీ మ్యాచుతో ఎంతో నేర్చుకోవచ్చని చెప్పాడు. “తటస్థంగా ఉండడం, ఆటగాడిగా, జట్టు కెప్టెన్ ఎంత మెరుగవుతు న్నామన్నది ముఖ్యం. నేను అనుసరించే విధానం ఇదే’’ అని రాహుల్ పేర్కొన్నాడు. ఆటలో పొరపాట్లు సహజమేనని, మహా అయితే 10,20 మ్యాచులకు తప్పులను వాయిదా వేయవచ్చన్నాడు. కెప్టెన్ గా తాను నేర్చుకున్నది ఇదేనని చెప్పాడు. ఇదిలా ఉంటే ఐపీల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా రాహుల్ ను రూ.17 కోట్లకు డీల్ చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement