Sunday, April 28, 2024

బాలయ్య బ్రాండ్ ని టచ్ చేసిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సారి నందమూరి నటసింహం బాలకృష్ణ ను కెలికారు నాగబాబు. ఇంస్టాగ్రామ్ లైవ్ చాటింగ్ లో పాల్గొన్న నాగ బాబు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. అదే సమయంలో మంచి బ్రాండ్ పేరు చెప్పండి మాస్టారు అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు. వెంటనే నాగబాబు మేన్సన్ హౌస్ బ్రాందీ బాటిల్ ని షేర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ బ్లడ్ వేరు… ఆ బ్రాండ్ వేరు అంటూ కామెంట్ చేశారు.

ఇక అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ తాగే బ్రాండ్ మేన్సన్ హౌస్. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఇక తన సినిమాల్లో ఎక్కువగా వంశం, బ్లడ్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఓవైపు మేన్సన్ హౌస్ బ్రాందీ గురించి మాట్లాడుతూ బ్లడ్ గురించి కూడా కామెంట్ చేయడం నాగబాబు బాలయ్యను మళ్లీ గెలుకుతున్నడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గతంలో కూడా నాగబాబు నా ఇష్టం అంటూ యూట్యూబ్ ఛానల్ ను పెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement