Thursday, May 2, 2024

“మెగా బ్లాక్ బ‌స్ట‌ర్‌”.. వెండితెర‌పై అల‌రించ‌నున్న దాదా, రోహిత్‌?

టీమిండియా కెప్టెన్ రోహిత్​ శర్మ వెండితెరపై అలరించనున్నాడా? త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అరంగేట్రం ఉంటుందా? బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో కలిసి నటించబోతున్నాడా? కీలక పాత్రలో నేషనల్​ క్రష్​ రష్మిక, తమిళ స్టార్ హీరో కార్తి నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నలుగురు కలిసి తమ ఇన్​స్టా ఖాతాల్లో ఒకే రకమైన పోస్ట్​ చేయడమే దీనికి కార‌ణంగా చెబుతున్నారు. న‌లుగురు కలిసి ‘‘మెగా బ్లాక్​ బస్టర్’’​ అంటూ తమ ఫొటోలతో ఉన్న పోస్టర్లను షేర్​ చేశారు.

సెప్టెంబర్​ 4వ తేదీన దీని ట్రైలర్​ రిలీజ్​ అవ్వబోతున్నట్లు కూడా అందులో తెలిపారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ పోస్టు చూసి ఈ నలుగురు కలిసి పాన్​ ఇండియా సినిమా చేయబోతున్నారా?, మరేదైనా ఓ స్పెషల్​ ప్రోగ్రామ్​లో ఉంటుందా? లేక‌ రియాలిటీ షో ఏదైనా ప్లాన్​ చేశారా? యాడ్​లో నటించారా? అని ప్ర‌శ్న‌ల‌తో ముంచెత్తుతున్నారు. కాగా, ఇప్పటికే దాదా తన బయోపిక్​ను ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. ఒకవేళ ఈ బయోపిక్​ గురించే ఈ అప్డేట్​ ఇవ్వబోతున్నారా అనే అనుమానం కూడా ఫ్యాన్స్​లో మొద‌లైంది. ఏదేమైనప్పటికీ ఈ సస్పెన్స్​ వీడాలంటే ఆ ట్రైలర్​ విడుదలయ్యే దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement