Saturday, May 4, 2024

వెంకీ అట్లూరి తో మాస్ మహారాజా ?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అలాగే శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి. అయితే వీటితో పాటు మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడట రవితేజ. అయితే అందులో భాగంగానే వెంకీ అట్లూరి రవితేజ కు ఓ కథను చెప్పాడట. రవితేజకు కూడా ఆ కథ ఎంతగానో నచ్చిందట.

దీంతో వీరిద్దరి సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో రవితేజ ను వెంకీ అట్లూరి డిఫరెంట్ గా చూపించబోతున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి అక్కడ కూడా అధికారిక ప్రకటన రాలేదు. మరి చూడాలి ఇందులో ఎంత వరకు నిజం ఉందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement