Friday, April 26, 2024

బాలయ్య 108వ సినిమా ఎవరితో తెలుసా ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత బాలయ్య మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్. రత్నం బాలయ్య కోసం ఓ కథను రాశాడట. ఇప్పటికే బాలయ్యకి కథ కూడా వినిపించాడట.

అయితే కథ విన్న బాలయ్య ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ లో చేయబోతున్నారట బాలయ్య. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదట. ఇక దీనితో పాటు అనిల్ రావిపూడి, శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement