Thursday, May 2, 2024

బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ మరో సినిమా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ప్రస్తుతం పవన్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో… సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా బండ్లగణేష్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఇప్పటికే పవన్ తో రెండు సినిమాలు నిర్మించిన బండ్లగణేష్ ఇప్పుడు మూడో సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డేట్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో సీరియస్ గా కథను వెతుక్కునే పనిలో ఉన్నాడట బండ్లగణేష్. ఈ నేపథ్యంలోనే పలువురు దర్శకులను, రైటర్స్ ను కలుస్తున్నాడట. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు సరిపడే విధంగా కథను సిద్ధం చేయాలని కోరుతున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement