Saturday, April 27, 2024

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను ఫాలో అవుతున్న మాస్ మహారాజా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా అదే త్రోవ లో వెళ్తున్నారు. రవితేజ తన 68వ చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలోనే తెరకెక్కబోతుందట. అలాగే ఈ సినిమాకు ఎమ్మార్వో అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట దర్శక నిర్మాతలు.

గంధపు చెక్కల స్మగ్లర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించే ఓ ఎమ్మార్వో పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర ఎంతో డిఫరెంట్ గా ఉండబోతుందట. ఎన్నడూ కూడా రవితేజ ఇటువంటి పాత్రలో కనిపించింది లేదని టాక్ నడుస్తోంది. మరి ఎమ్మార్వో గా రవితేజ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement