Friday, May 3, 2024

డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుంది: WHO హెచ్చరిక

కరోనా డెల్టా వేరియంట్ కాబోయే రోజుల్లో మరింత విజృంభిస్తుందని WHO హెచ్చరించింది. ప్రస్తుతం ఆ వేరియంట్ 96 దేశాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది. వారాంతపు నివేదికను విడుదల చేసిన డబ్ల్యూహెచ్ వో.. జూన్ 29 నాటికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్ కనిపించిందని పేర్కొంది. అయితే, చాలా దేశాల్లో జన్యు క్రమ విశ్లేషణ సామర్థ్యాలు తక్కువగా ఉండడంతో డెల్టాను గుర్తించడం కష్టమవుతోందని, ఇంకా చాలా దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ కేసులు ఉండి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే డెల్టా వేరియంట్ ఉన్న దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారని చెప్పింది. రాబోయే రోజుల్లో ఇతర వేరియంట్లను డెల్టా అధిగమించేస్తుందని పేర్కొంది.

డెల్టా సహా ఇతర రకాల కరోనాలను ఎదుర్కొనేందుకు ఇప్పటిదాకా ఏర్పరచుకున్న వనరులు సమర్థంగా పనిచేస్తాయని తెలిపింది. వేరియంట్ల వ్యాప్తి పెరిగేకొద్దీ కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇప్పటికీ చాలా దేశాల్లో టీకా కార్యక్రమం చాలా నిదానంగా సాగుతోందని, ఇలాంటి సందర్భంలో వేరియంట్ల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని డబ్ల్యూహెచ్ వో సూచించింది.

ఇది కూడా చదవండి: కేసీఆర్ చేతిలోకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్?

Advertisement

తాజా వార్తలు

Advertisement