Saturday, November 30, 2024

మార్క్‌ ఆంటోనీ షూటింగ్ కంప్లీట్.. కేక్ క‌ట్ చేసిన విశాల్ టీం

త‌మిళ హీరో విశాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మార్క్‌ ఆంటోనీ..విశాల్ దీంతోపాటు స్వీయ‌ దర్శకత్వంలో తుప్పరివాల‌న్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ డిటెక్టివ్ ఫిల్మ్‌ను హోంబ్యాన‌ర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తున్నాడు. మరోవైపు విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరోలు సునీల్‌, విశాల్‌ అండ్‌ టీం కేక్‌ కట్‌ చేసిన వీడియో నెట్టింట హల్‌ చల్ చేస్తోంది.మార్క్‌ ఆంటోనీకి అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మార్క్‌ ఆంటోనీ మోషన్‌ పోస్టర్ తో సునీల్‌, ఎజేసూర్య, సెల్వ రాఘవన్‌ పాత్రలను పరిచయం చేస్తూ.. సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేసింది విశాల్‌ టీం. ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్‌ కుమార్ తెరకెక్కిస్తున్నారు. మార్క్ ఆంటోనీ చిత్రంలో రీతూవ‌ర్మ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement