Saturday, April 27, 2024

Mansion 24 Web Series – రావు ర‌మేష్ లుక్ అదుర్స్…

హాట్ స్టార్ లో మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే త్వరలో రానున్న వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’. హారర్ థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చేయడంలో మంచి ప్రవేశం ఉన్న ఓంకార్ ఈ సిరీస్ ను రూపొందించాడు. ఈ సిరీస్ నుంచి ఇంతవరకూ వరలక్ష్మి శరత్ కుమార్ .. సత్యరాజ్ .. అవికా గోర్ పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. తాజాగా రావు రమేశ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒక కన్నుతో మాత్రమే చూడగలిగే ఒక పల్లెటూరి వ్యక్తి పాత్రలో ఆయన కనిపిస్తున్నాడు. లాంతరు వెలుగులో దేనినో చూసి ఆయన ఆశ్చర్యపోవడం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో బిందుమాధవి .. తులసి .. మీనా కుమారి .. విద్యుల్లేఖ రామన్ .. అభినయ .. రాజీవ్ కనకాల కనిపించనున్నారు. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement