Sunday, April 28, 2024

Manas,Sreeja: శ్రీజ‌తో మాన‌స్ పెళ్లి బంధం…

బుల్లితెర సీరియల్ నటుడు మానస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి జనాల మనసును దోచుకున్నాడు.. బిగ్ బాస్ లో కూడా మెరిసాడు.. ఇలా అందరికీ మానస్ సుపరచితమే.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని ల్లో నటించాడు.

అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ అధికం.. ఇక సెప్టెంబర్ 2న విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీజ మానస్ నిశ్చితార్థం చేసుకున్నాడు. త‌జాగా విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా బుధవారం రాత్రి మానస్ – శ్రీజల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు సినీ, టీవీ ప్రముఖుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement