Thursday, May 16, 2024

OTTలో మమ్ముట్టి ‘కాథల్ ది కోర్’..

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘కాథల్ ది కోర్’. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తుంది అనే కథాంశంతో ఈ సినిమాను జో బేబీ తెర‌కెక్కించారు. న‌వంబ‌ర్ 23న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక‌ ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు.

కాగా, ఈ బ్లాక్ బస్టర్ సినిమా డిజిట‌ల్ రైట్స్ ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement