Monday, May 13, 2024

క్రికెట్ కోచ్ గా మహేష్ బాబు..!

మహేష్ బాబు ఏంటి క్రికెట్ కోచ్ అవతారం ఎత్తుబోతున్నాడని అనుకుంటున్నారా..! ఇది నిజ జీవితంలో కాదు తన తదుపరి సినిమా కోసం క్రికెట్ కోచ్ పాత్రలో మహేష్ నటించబోతున్నాడు. అనిల్ రావిపూడి సినిమాలో మహేశ్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కార్ వారి పాట’, అనిల్ ‘ఎఫ్ -3’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తికాగానే తమ ఇద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాని సెట్స్ కు తీసుకు వెళ్లనున్నారని వినిపిస్తోంది. ఇందులో మహేశ్ ను అనిల్ రావిపూడి ఇప్పటివరకూ ఎవరూ చూపించనటువంటి పాత్రలో చూపించబోతున్నాడట. ‘సరిలేరు..’ లో మహేష్ ని ఆర్మీ ఆఫీసర్ గా చూపించిన అనీల్ రాబోయే సినిమాలో క్రికెట్ కోచ్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఈ పాత్ర మహేష్ కి కూడా నచ్చిందట. పూర్తిగా అనిల్ రావిపూడి టైప్ లో ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఉంటుందట. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేశ్, అనిల్ మరోసారి అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తారేమో చూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement