Friday, April 26, 2024

మగువా…మగువా … ఫిమేల్ వెర్షన్ వీడియో సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శృతి హసన్ నటించగా… అంజలి, నివేద థామస్, అనన్య కీలక పాత్రలో నటించారు. అలాగే ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్ర పోషించారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలోని మగువా.. మగువా ఫిమేల్ వెర్షన్ కు సంబంధించిన వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కన్నా ఏడాది ముందు రిలీజ్ అయిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించి ఫిమేల్ వెర్షన్ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement