Friday, April 26, 2024

మామా మశ్చీంద్ర.. టీజ‌ర్ రిలీజ్ చేసిన మ‌హేశ్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు మామా మశ్చీంద్ర సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు న‌టిస్తున్నాడు. హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ షా రెబ్బా, మిర్నాలిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా, సుధీర్ బాబు మూడు వేర్వేరు గెటప్స్ లో కనిపించ నున్నారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మామ మశ్చీంద్ర అనే సినిమా కోసం సుదీర్ బాబు ఈ బబ్లి లుక్ లో కనిపించాడు. బుగ్గలు, పోట్ట ఇలా తను ఇంతవరకు ఎప్పుడు కనిపించని రూపంలో దర్శనం ఇచ్చాడు.మ‌రి ఈ చిత్రం రిలీజ్ త‌దిత‌ర విష‌యాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement