Thursday, May 2, 2024

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్ లో లారెన్స్ రుద్రుడు ట్రైల‌ర్.. రిలీజ్ చేసిన మేక‌ర్స్

నటుడు, డ్యాన్సర్, డైరెక్ట‌ర్ రాఘవేంద్ర లారెన్స్ ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 సినిమాతో పాటు కథిరేసన్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ రుద్రుడు అనే సినిమా కూడా చేస్తున్నారు. యువ భామ ప్రియా భవానిశంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఫైవ్ స్టార్ క్రియేషన్స్, పిక్సెల్ స్టూడియెస్ సంస్థలు దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ తమిళ్, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

కాగా, ఈ మూవీ తమిళ వెర్షన్‌ ప్రమోషన్స్‌ కూడా బాగానే జరుగుతున్నాయి. ఇటీవల ఈమూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ అఫీషియల్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ట్రైల‌ర్ చూస్తుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక‌ లారెన్స్ కూడా త‌న యాక్టింగ్ తో ఎప్పటిలాగే అద్భుతంగా ఆక‌ట్టుకున్నాడు.

పిక్సెల్ స్టూడియోస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో ఈ సినిమాని రిలీజ్ చేయనుంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ మూవీని నిర్మిస్తోంది. పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌డి రాజశేఖర్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్న ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement