Friday, May 17, 2024

Guntur Karam | గుంటూరు కారంపై లేటేస్ట్ బజ్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వ‌స్తున్న సినిమా గుంటూరు కారం. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వ‌చ్చే ఏడాది (జనవరి) 12న థియేటర్లలోకి రానుంది. కాగా, తాజా అప్డేట్ ప్రకారం.. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 6న మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక‌, ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్య కృష్ణన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement